- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుల్లితెరపైకి స్మృతి ఇరానీ రీఎంట్రీ.. వైరల్ అవుతున్న ‘తులసీ వీరానీ’ గెటప్ ఫొటో!
మళ్లీ బుల్లితెరపైకి స్మృతి ఇరానీ రీఎంట్రీ ఇస్తుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆమె తులసీ వీరానీ గెటప్‌లో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరపై కనిపించనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆమెకు బాగా పేరు తెచ్చిన ‘క్యూంకీ సాస్ బీ కభీ బహూ థీ’ సీరియల్‌లోని తులసీ వీరానీ పాత్రలో మరోసారి ప్రేక్షకులను ఆమె పలకరించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఖాళీగానే ఉన్న ఆమె.. మరోసారి ఈ సీరియల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ తులసీ వీరానీ పాత్ర గెటప్‌లో స్మృతి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా, ఇటీవలే ఈ సీరియల్ పాతికేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పాత ఫొటోను షేర్ చేసిన స్మృతి.. పాతికేళ్ల క్రితం ఒక కథ భారతీయ కుటుంబాల్లోకి ప్రవేశించి, వారి జీవితాల్లో భాగంగా మారింది. ఇది కేవలం ఒక షో కాదు. ఒక ఎమోషన్, ఒక జ్ఞాపకం, ఒక యజ్ఞం. కుటుంబాలు తమ పనులన్నీ మార్చేసి టీవీ ముందు కూర్చొని ఈ సీరియల్ చూస్తూ నవ్వేవి, ఏడ్చేవి, ఆశ పడేవి. తులసిని తమ కుటుంబంలో సభ్యురాలిగా మార్చుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణం నా ఒక్కదానిదే కాదు, మనందరిదీ’ అని రాసుకొచ్చారు.






