- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య, బిడ్డల్ని చంపి ఆపై మిస్సింగ్ అని కట్టుకథ అల్లిన ఫారెస్ట్ అధికారి
గుజరాత్‌లో పని చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారి భార్య బిడ్డల్ని చంపి, ఆపై వారు మిస్సైనట్టు కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లో పని చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారి భార్య బిడ్డల్ని చంపి, ఆపై వారు మిస్సైనట్టు కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి అయిన శైలేష్ ఖంభాలా తన భార్య నయన, 13 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడిని హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతి పెట్టాడు. దీపావళి పండగ సందర్భంగా సూరత్ నుంచి భర్త దగ్గరికి వచ్చిన నయన, అత్తవారింట్లో కాకుండా భర్తతో కలిసి భావ్‌నగర్‌లో ఉంటానని గొడవ చేయడంతో శైలేష్ భార్య, పిల్లలను చంపేశాడు.
నవంబర్ 5న వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన శైలేష్, సెక్యూరిటీ గార్డు చెప్పినట్లు తన భార్య పిల్లలతో ఆటోలో వెళ్లిందని చెప్పాడు. కానీ సెక్యూరిటీ గార్డును ప్రశ్నించగా అది అబద్ధమని తేలింది. శైలేష్ కాల్ డాటా పరిశీలించగా.. నవంబర్ 2న జూనియర్ అధికారి గిరీష్ వానియాకు క్వాటర్స్ వెనుక రెండు గుంతలు తీయమని, తర్వాత నవంబర్ 6న జింక చనిపోయిందని చెప్పి డంపర్ లారీ పంపమని చెప్పినట్లు తెలిసింది.
నవంబర్ 16న పోలీసులు గిరీష్‌ను తీసుకుని క్వాటర్స్ వెనుక రెండు గోతులను తవ్వించగా అందులో నయన, ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. శైలేష్ నేరాన్ని ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.






