భారత్, పాక్ యుద్ధం వాళ్లే ఆపేశారు.. తొలిసారి క్రెడిట్ కొట్టేయని ట్రంప్

by Phanindra |

భారత్, పాక్ యుద్ధం ఆపడం ఆ రెండు దేశాల నిర్ణయమే అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తొలిసారి తను యుద్ధం ఆపాననే మాట చెప్పకపోవడమ గమనార్హం.

భారత్, పాక్ యుద్ధం వాళ్లే ఆపేశారు.. తొలిసారి క్రెడిట్ కొట్టేయని ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ ఉద్రిక్తతలను ఆపింది ఆ రెండు దేశాలనేనని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇన్నిరోజులుగా భారత్, పాక్ యుద్ధాన్ని తనే ఆపానని ప్రచారం చేసుకున్న ట్రంప్.. ఇరుదేశాల నాయకులు చాలా తెలివైర వారని, పరిస్థితి అణుయుద్ధం వరకు వెళ్లకముందే యుద్ధం ముగించారని అన్నారు. తన ఓవల్ ఆఫీసులో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో లంచ్ అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మునీర్‌ను కలవడం చాలా గౌరవంగా ఉందన్న ఆయన.. ఇరాన్ గురించి కూడా మునీర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ‘ఇరాన్ గురించి పాక్‌కు చాలా విషయాలు తెలుసు.


అయితే వాళ్లు కూడా చాలా విషయాల్లో సంతోషంగా లేరు. వాళ్లకు ఇజ్రాయెల్‌ గురించి కూడా బాగానే తెలుసు’ అని ట్రంప్ చెప్పారు. భారత్‌తో యుద్ధానికి వెళ్లనందుకు మునీర్‌ను లంచ్‌కు ఆహ్వానించానని, భారత ప్రధాని మోడీకి కూడా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నానని తెలిపారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నామని, పాక్‌తో కూడా ట్రేడ్ డీల్ చేసుకుంటామని చెప్పారు. ‘కొన్ని వారాల క్రితం మోడీ కూడా ఇక్కడకు వచ్చారు. ఈ రెండు దేశాల నేతలు చాలా తెలివైనవాళ్లు. వాళ్ల స్టాఫ్ కూడా మంచి తెలివికలవారే.


పరిస్థితి అణుయుద్ధం వరకు వెళ్లకముందే యుద్ధాన్ని ఆపేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఈ రెండు దేశాలు చాలా పెద్ద న్యూక్లియర్ పవర్స్. అలాంటి దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. మే 10న భారత్, పాక్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం జరిగినప్పటి నుంచి తనే ఈ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పలుమార్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సడెన్‌గా ఈ రెండు దేశాలే యుద్ధాన్ని ఆపాయని ట్రంప్ చెప్పడం గమనార్హం.

Next Story