ఎన్నికల్లో సత్తా చాటిన జానపద గాయని.. తొలి పోటీలోనే విజయం

by Naga Rani Yarlagadda |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటింది.

ఎన్నికల్లో సత్తా చాటిన జానపద గాయని.. తొలి పోటీలోనే విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో ఎన్డీయే కూటమి 126 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 77 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. ప్రతిపక్షమైన మహాగఠ్ బంధన్ 24 స్థానాల్లో గెలవగా.. 9 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున అలీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన పాతికేళ్ల జానపద సింగర్ మైథిలి ఠాకూర్ ఘన విజయం సాధించింది. సమీప ఆర్జేడీ అభ్యర్థి 63 ఏళ్ల బినోద్ మిశ్రాపై 12 వేల పైచిలుకు మెజార్టీతో మైథిలి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మైథిలి.. బిహార్ లోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా నిలించింది. అంతేకాదు ఇప్పుడు దేశంలోనే అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డును తన సొంతం చేసుకుంది. గతంలో ఈ రికార్డు మైనంపల్లి రోహిత్ పేరుపై ఉంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటికి మైనంపల్లి రోహిత్ వయసు 26 సంవత్సరాలు. అలీనగర్ నియోజకవర్గం నుంచి ప్రచారం చేస్తున్న సమయంలో.. తనను ఎన్నికల్లో గెలిపిస్తే.. అలీనగర్ పేరును సీతానగర్ గా మారుస్తానని హామీ ఇచ్చారు.

Next Story