- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం కలిగించేలా జీఎస్టీ రేటు సవరణ
రైతులు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం కలిగించేలా జీఎస్టీ రేటు సవరణలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: తాజా జీఎస్టీ రేటు సవరణలు సామాన్యులకు భారీ ఊరటనిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఢిల్లీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త సవరణలు రైతులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారాలకు లబ్ది చేకూరుస్తుందని ఆమె తెలిపారు. ‘కొత్త తరం జీఎస్టీ మూడు స్తంభాలపై నిలిచింది. నిర్మాణాత్మక సంస్కరణలు, రేటు రేషనలైజేష్, జీవితాలను సులభతరం చేయడంపై ఫోకస్ పెట్టింది’ అని సీతారామన్ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చూపించారు. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ, ఇన్సూరెన్స్‌పై పన్నులు, పరిహారంగా ఇచ్చే సెస్ తదితర అంశాలపై ఫోకస్ పెట్టారు. జీఎస్టీ సవరణల అవసరాన్ని సమావేశంలో సీతారామన్ వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆమోదించిన ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్‌కు వచ్చే నెలలో వెళ్తుంది.
కాగా, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కొత్త జీఎస్టీ స్లాబులను ప్రధాని మోడీ ప్రకటించారు. దీపావళి నుంచి జీఎస్టీలో కేవలం 5 శాతం, 18 శాతం స్లాబులు మాత్రమే ఉంటాయని మోడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.






