నేడే విజయ్ బలపరీక్ష

by velandi.Saikiran |

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి సీఎం విజయ్ ఇవాళ అసెంబ్లీలో బలం నిరూపించుకోబోతున్నారు.

నేడే విజయ్ బలపరీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విజయ్ కి ఇవాళ చాలా కీలకమైన రోజు. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి సీఎం విజయ్ ఇవాళ అసెంబ్లీలో బలం నిరూపించుకోబోతున్నారు. TVK పార్టీకి 108 సీట్లు ఉండగా... సీఎం విజయ్ ఒకచోట రాజీనామా చేశారు. ఒక్క ఓటుతో గెలిచిన శ్రీనివాస్ ఫ్లోర్ టెస్టులో పాల్గొనవద్దని హైకోర్టు చెప్పడంతో ఆ పార్టీ బలం 106కు పడిపోయింది. అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు విజయ్ కి మ‌ద్దతు ప్ర‌క‌టించాయి. ఈ క్రమంలోనే మిత్ర పక్షాల మద్దతుతో సీఎం విజయ్ బలం 120కి పెరిగింది. అన్నాడీఎంకే లోని ఓ వర్గం తాజాగా మద్దతు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. వాళ్లు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు TVK పార్టీకి ఓటు వేయనున్నారు. దీంతో విజయ్ 150 మంది ఎమ్మెల్యేలతో బలపరీక్ష నెగ్గబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story