ఉత్తరాఖండ్ లో వరదలు... 28 మంది కేరళ వాసుల మిస్సింగ్

by Muthe.Rajitha |

క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడుతూ ఉత్తరాఖండ్ అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది.

ఉత్తరాఖండ్ లో వరదలు... 28 మంది కేరళ వాసుల మిస్సింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడుతూ ఉత్తరాఖండ్ అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది. అయితే ఉత్తరాఖండ్ లో నిన్న జరిగిన భారీ విలయంలో కేరళకు చెందిన 28 మంది టూరిస్టులు మిస్సయినట్టు సమాచారం. ఈ బృందంలోని బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి ఉదయం బయల్దేరుతున్నట్టు చెప్పారని, అనంతరం వారి ఫోన్లు పని చేయడం లేదని, వాటిలో ఛార్జింగ్ లేదో. లేక సిగ్నల్ లేదో తెలియక భయంతో పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు.

అయితే వారు వెళ్తున్న మార్గంలో ధారాలిలో నిన్న ఆకస్మిక వరదల వల్ల ఆ ఊరంతా బురద కింద కూరుకుపోయింది. కేరళకు చెందిన వీరిలో 20 మంది ముంబైలో స్థిరపడగా మిగతావారు కేరళలో స్థిరపడ్డారు. వీరంతా హరిద్వార్ లోని ఓ ట్రావెల్ ఏజెన్సీ మాట్లాడుకొని గంగోత్రికి బయల్దేరే మార్గంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Next Story