- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్‌ను బీభత్సమైన వరదలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా దక్షిణ థాయ్‌లాండ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు తెలిపారు. వరదల తీవ్రత వల్ల 12 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతినగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత స్థలాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అనేక చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేసారు.
Next Story






