ఫ్లైట్ ల్యాండింగ్‌లో సమస్య.. 15 నిమిషాలు గాల్లోనే చక్కర్లు

by Kema Shiva Kumar |

అహ్మదాబాద్ (Ahmadabad) విమాన ప్రమాద ఘటన దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.

ఫ్లైట్ ల్యాండింగ్‌లో సమస్య.. 15 నిమిషాలు గాల్లోనే చక్కర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ (Ahmadabad) విమాన ప్రమాద ఘటన దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. దీంతో అప్పటి నుంచి ఫ్లైట్‌లో ప్రయాణించాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల విమానాల్లో సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతోన్న విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఇవాళ మరో భయానక ఘటన చోటచేసుకుంది. ఉదయం ముంబై (Mumbai) ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో (Indigo)‌ ఫ్లైట్ ప్రయాణికులతో నాగ్‌పూర్‌ (Nagpur)కు బయలుదేరింది. అయితే, కరెక్ట్‌గా ఫ్లైట్ ల్యాండ్ అవుతోన్న క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా రన్‌వే సరిగా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని ఒక్కసారిగా పైకి లేపాడు. దీంతో ప్రయాణికులంతా భారీ కుదుపునకు గురై.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 15 నిమిషాలు గాల్లోనే పైలట్ చక్కర్లు కొట్టి తిరిగి రన్‌వేపై ఫ్లైట్‌‌ను సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story