- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నదిలో మునిగిన యుద్ధ ట్యాంకర్.. ఐదుగురు భారత సైనికులు మృతి
by Prasad Jukanti |
ఇండియన్ ఆర్మీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది. సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండగా ఓ యుద్ధ ట్యాంక్ నదిలో మునిగిపోియంది. ఈ ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ)తో సహా ఐదుగురు సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాతంలో జరిగినట్లు సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్ లోని దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలోని మందిర్ మోర్హ్ వద్ద టి-72 ట్యాంక్ లో సైనికులు నదిని దాటుతుండగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. నీటి ఉధృతికి ట్యాంక్ మునిగిపోగా అందులోని జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






