భారీ వర్షాలకు నగరంలో ఐదుగురు మృతి.. కొన్నిగంటల్లో అతిభారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |

ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు.. పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాను ముంచెత్తాయి.

భారీ వర్షాలకు నగరంలో ఐదుగురు మృతి.. కొన్నిగంటల్లో అతిభారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు.. పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాను ముంచెత్తాయి. భారీ వర్షాలకు నగరంలో ఐదుగురు మృతి చెందారు. కరెంట్ షాక్ తో ముగ్గురు, వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో సౌత్ బెంగాల్ లోని కొన్ని జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఈదురు గాలుల ధాటికి నగరంలో లోతట్టు ప్రాంతాలు సహా.. ప్రధాన రహదారులు నీటమునగడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లు కూలిపోగా, పలుచోట్ల భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు సైతం దెబ్బతినడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ సూచించింది. షాహిద్ ఖుదిరామ్, మైదాన్ స్టేషన్ల మధ్య రైల్వే పనులను, పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Next Story