Bihar : బీహార్‌లో దారుణం.. మంత్రాల నెపంతో ఐదుగురి సజీవ దహనం

by Muthe.Rajitha |   (  Updated:2025-07-07 14:12:48  IST  )

బీహార్‌లో(Bihar) దారుణ ఘటన చోటు చేసుకుంది.

Bihar : బీహార్‌లో దారుణం.. మంత్రాల నెపంతో ఐదుగురి సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌(Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని పూర్నియా(Purnia) జిల్లాలో మంత్రాలు(Black Magic) చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని సజీవ దహనం(Burning Alive) చేసిన ఘటన కలకలం రేపింది. పూర్నియా ఎస్పీ వివరాల ప్రకారం.. ముఫస్సిల్ థానా పరిధిలోని రాజీగంజ్ పంచాయత్‌లో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని స్థానికులు చేతబడి చేస్తున్నారనే అనే నెపంతో దారుణంగా కొట్టి, సజీవంగా దహనం చేశారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉండగా.. ఒక బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

బాలుడు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్నియా ఎస్పీ, ఏఎస్పీ సహా పలు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టాయి. ఈ ఘటన బీహార్లో తీవ్ర కలకలం రేపింది.

Next Story