- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం సమీపంలోని ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం సమీపంలోని ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి పైనుంచి కిందికి పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారుల సమాచారం.
ఢిల్లీ నుంచి గుజరాత్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓవర్‌స్పీడ్ కారణంగా కారు రహదారి మధ్యలో ఉన్న గుంతను ఢీకొని అదుపుతప్పి లోయలో బలంగా పడినట్లు ప్రాథమిక సమాచారం. ఢీకొన్న ప్రభావం కారణంగా వాహనం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేగాక, ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కారు అదుపుతప్పిన విధానం, పడిపోయిన తీరు భయానకంగా ఉండటంతో వీడియోలు విస్తృతంగా వైరల్‌గా అయ్యాయి. కారు నెంబర్ MHO3 EL 1388 గా పోలీసులు గుర్తించారు. బాధితులు అహ్మదాబాద్, ముంబై నివాసితులుగా పోలీసులు గుర్తించారు. వారిలో గులాం రసూల్ (70), ఖలీస్ చౌదరి, అబ్దుల్ గులాం చౌదరి, డానిష్ చౌదరి (15), దుర్గేష్ ప్రసాద్ (35) గా గుర్తించారు. ధ్వంసమైన కారు నుంచి మృతదేహాలను వెలికితీయడంలో స్థానికులు పోలీసులకు సహాయం చేశారు. మృతదేహాలను రత్లాంలోని డాక్టర్ లక్ష్మీ నారాయణ్ పాండే ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.






