Fishermen's shock : మత్స్యకారుల షాక్..పంట పండిందని సంబరం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-22 06:51:14.0  )
Fishermens shock : మత్స్యకారుల షాక్..పంట పండిందని సంబరం
X

దిశ, వెబ్ డెస్క్ : సముద్రంలో చేపల వేట(Fishing in the Sea)కొనసాగించే మత్స్యకారుల(Ffishermens)కు ఒక్కోసారి ఎదురయ్యే అనుభవాలు వారికి లాభ నష్టాలను కల్గిస్తుంటాయి. ఈ దఫా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అలాంటి షాకింగ్ ఘటనే ఎదురైంది.

తమిళనాడులోని తూత్తుక్కుడిలో పెరియాతలై తీరంలో జోసెఫ్‌ అనే మత్స్యకారుడితో పాటు మరో నలుగురు చేపలు వేటకు వెళ్లారు. వల చాల బరువుగా ఉండటంతో అందులో ఏముందన్న సందేహానికి గురయ్యారు. అతి కష్టం మీద వారు వలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి చూడగా వలలో పడిన భారీ చేపను చూసి షాక్(Shocking) అయ్యారు. టన్ను బరువున్న(Ton Weight) రే-ఫిష్(Ray-Fish) వలలో పడింది. ఏకంగా వెయ్యి కిలోల బరువు ఉన్న రే-ఫిష్ చిక్కడంతో మత్స్యకారుల ఆనందం(Happiness) అంబరాన్ని తాకింది.

తాము మోయలేనంత బరువైన చేప తమ వలకు చిక్కడంతో వారు క్రేన్ సహయంతో దాన్ని బయటకు తీసి విక్రయించి ఈ రోజు తమ పంట పండిందనుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. వారు ఆ భారీ చేపను వేలం వేయగా రూ.56వేలు ధర పలికింది.

Advertisement

Next Story

Most Viewed