భద్రతా దళాల తొలి విజయం.. లష్కరే తొయిబా టాప్‌ కమాండర్‌ హతం

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-25 06:00:17  IST  )

జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహిస్తున్న స్పెషల్ ఆపరేషన్‌లో తొలి విజయం సాధించారు.

భద్రతా దళాల తొలి విజయం.. లష్కరే తొయిబా టాప్‌ కమాండర్‌ హతం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని బందిపొరా (Bandipora) ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహిస్తున్న స్పెషల్ ఆపరేషన్‌ (Special Operation)లో తొలి విజయం సాధించారు. ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో లష్కర్-ఎ-తోయిబా (LET) టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లి (Altaf Lalli) దుర్మరణం పాలయ్యాడు. అదేవిధంగా ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఏప్రిల్ 22న పహల్గాం (Pahelgam)లో జరిగిన టెర్రర్ అటాక్‌ (Terror Attack)లో అల్తాఫ్ లల్లి హస్తం ఉన్నట్లుగా సెక్యూరిటీ ఫోర్సెస్ గుర్తించాయి. దీంతో బందిపొరా‌ (Bandipora)లో దాక్కున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వారిపై బుల్లెట్ల వర్షం కురిపించగా.. లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి (Altaf Lalli) తీవ్ర గాయాలతో హతమయ్యాడు.

Next Story