Odisha : ఒడిశాలో మావోయిస్టులకు, బలగాలకు ఎదురు కాల్పులు

by Muthe.Rajitha |

ఒడిశా(Odisha)లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మావోయిస్టులకు(Maoists), బలగాలకు ఎదురు కాల్పులు(Firing) జరుగుతున్నాయి.

Odisha : ఒడిశాలో మావోయిస్టులకు, బలగాలకు ఎదురు కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా(Odisha)లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మావోయిస్టులకు(Maoists), బలగాలకు ఎదురు కాల్పులు(Firing) జరుగుతున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా(Malkangiri)లోని తెంతులిగూడ సమీపంలోని చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతుందని భద్రతా బలగాలకు సమాచారం అందింది. మల్కన్‌గిరి జిల్లా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (DVF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సంయుక్తంగా మావోయిస్టుల సమావేశాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

కొందరు మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ.. ఏరియా కమిటీ మెంబర్లు కేశా కవాసి(Kesha Kavasi), రాకేశ్ అలియాస్ సాను కుంజమ్(Sanu Kunjam) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 5 లక్షల రూపాయల రివార్డ్ ఉంది. ఈ ఆపరేషన్‌లో ఒక పిస్టల్, 6 రౌండ్ల బుల్లెట్లు, 10 డిటోనేటర్లు, 2 స్టీల్ కంటైనర్లు, మావోయిస్ట్ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఎవరైనా మరణించరా లేదా అని ఇంకా తెలియరాలేదు.

Next Story