China wildfire: కార్చిచ్చు బీభత్సం.. తగలబడుతున్న చైనా

by D.Reddy |
China wildfire: కార్చిచ్చు బీభత్సం.. తగలబడుతున్న చైనా
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)లో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర చైనాలోని షాన్‌షీ ప్రావిన్స్‌లోని లింగ్‌చౌన్ కౌంటీలో మంగళవారం భారీ మంటలు చెలరేగాయి. దాదాపు 3 వేల మంది సిబ్బంది ఈ మంటలను అదుపుచేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే, మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో ఐదు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ మంటలు శనివారం హుగువాన్ కౌంటీలో చెలరేగగా, ఆదివారం బలమైన గాలులు వీయటంతో పక్కనే ఉన్న లింగ్‌చౌన్‌ వరకు వ్యాపించాయి.

వాతావరణం పొడిగా ఉండడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు బలమైన గాలులు వీయడం, ఎత్తైన పర్వత ప్రాంతం, దట్టమైన మండే స్వభావం కలిగిన వృక్ష సంపద వంటివి మంటలను ఆర్పేందుకు సవాల్‌గా మారుతున్నాయన్నారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. అలాగే లింగ్‌చౌన్‌ నుంచి 266 మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మంటలు త్వరగా అదుపులోకి రాకపోతే నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed