- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Girija Vyas : హారతి ఇస్తుండగా మంటలు.. కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలు
దేవుడి గదిలో పూజ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : దేవుడి గదిలో పూజ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్(Rajasthan) లోని ఉదయ్ పూర్ లో పూజ సమయంలో హారతి ఇస్తుండగా అనుకోకుండా మంటలు దుపట్టాకు అంటుకొని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్(Girija Vyas) కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ కు తరలిస్తున్నారని సమాచారం. సోమవారం ఉదయం ఆమె నివాసంలో ఈ ఘటన జరిగినట్టు ఆమె సోదరుడు గోపాల్ శర్మ పేర్కొన్నారు. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. ఆమె గాయాల దృష్ట్యా అహ్మదాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా గిరిజా వ్యాస్ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా, జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా పని చేశారు.






