ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

by Muthe.Rajitha |

ఎయిర్ ఇండియా(Air India) విమానాలను సమస్యలు వెంటాడుతున్నాయి.

ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎయిర్ ఇండియా(Air India) విమానాలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం కారణంగా 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా నేడు అలాంటి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ(Hong Kong to Delhi)కి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానానంలో మంటలు(Fire Accident) చెలరేగాయి. విమానం ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై, హాహా కారాలు చేసారు.

ఎయిర్ పోర్ట్ సిబ్బంది తక్షణమే ప్రయాణికులను, సిబ్బందిని కిందకి దింపేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. మంటలకు గల కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు.

Next Story