విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. స్పాట్‌కు 8 ఫైరింజన్లు

by Naga Rani Yarlagadda |

దేశరాజధాని ఢిల్లీలో ఉన్న కేంద్ర విద్యాశాఖ కార్యాలయ భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.

విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. స్పాట్‌కు 8 ఫైరింజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో ఉన్న కేంద్ర విద్యాశాఖ కార్యాలయ భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయం భవనంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐటీఓ (ITO) పరిధిలో గల 'స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్' (SPA) క్యాంపస్‌లో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. 8 ఫైరింజన్లు స్పాట్ కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు రెండుగంటలపాటు శ్రమించారు. కాగా.. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని అధికారులు ధృవీకరించారు. కార్యాలయంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ప్రమాదం సంభవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Next Story