Fire Accident: జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్నిప్రమాదం

by D.Reddy |
Fire Accident: జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ మార్కెట్లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే వరుసగా ఉన్న 50 షాపులు, రెస్టారెంట్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. పైగా ఇక్కడ అగ్నిమాపక యూనిట్ లేకపోవటంతో.. దాదాపు 20-40 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండ్, కంగన్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చే సరికి భారీ నష్టం జరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed