- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident : అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ తెలుగు విద్యార్థులు
ఓ ఘోర అగ్నిప్రమాదం(Massive Fire Accident) నుంచి పలువురు తెలుగు విద్యార్థులు(Telugu Students) ప్రాణాలతో బయటపడిన ఘటన అమెరికా(USA)లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ ఘోర అగ్నిప్రమాదం(Massive Fire Accident) నుంచి పలువురు తెలుగు విద్యార్థులు(Telugu Students) ప్రాణాలతో బయటపడిన ఘటన అమెరికా(USA)లో చోటు చేసుకుంది. అమెరికాలోని బర్మింగ్‌హామ్(Birmingham)లో జరిగిన ఈ అగ్నిప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అపార్టుమెంట్లలో ఉన్న పది మంది విద్యార్థులను రక్షించారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని, వారు అలబామా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు. క్షేమంగా బయటపడిన విద్యార్థి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం బిల్డింగ్‌లో మంటలు వ్యాపించాయని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వేగంగా అపార్టుమెంట్ మొత్తం వ్యాపించాయని తెలిపారు. అందరం వెనుక డోర్ నుంచి బయటకు వచ్చేశామని, కానీ ఒకరు మాత్రం పొగలు దట్టంగా అలముకోవడంతో అందులో చిక్కుకుపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగానే ఉన్నదని వెల్లడించారు. కాగా విద్యార్థుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






