Supreme Court: చైల్డ్ ట్రాఫికింగ్ పై సుప్రీం కోర్టు సీరియస్

by Shamantha N |

చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలు సమాజానికి ప్రమాదకరం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే అదృశ్యమైన ఆరుగురు పిల్లను రక్షించాలని పోలీసులను ఆదేశించింది.

Supreme Court: చైల్డ్ ట్రాఫికింగ్ పై సుప్రీం కోర్టు సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలు సమాజానికి ప్రమాదకరం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే అదృశ్యమైన ఆరుగురు పిల్లను రక్షించాలని పోలీసులను ఆదేశించింది. అప్పుడే పుట్టిన చిన్నారుల లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలపై జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ‘‘ ఢిల్లీలో మిస్ అయిన ఆరుగురు చిన్నారుల ఆచూకీని గుర్తించాలి. చిన్నారులను అమ్మతున్న, కొంటున్న వారిని చట్టానికి అప్పగించండి. వారంతా నిందుతులే. వారి వల్ల సమాజానికి ముప్పు ఉంది. పిల్లల అక్రమరవాణా దారులు హంతకులకంటే ప్రమాదకరం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. “హత్య కేసుల్లో పలు కారణాలు, ఉద్దేశాలు ఉంటాయి. మరో హత్య చేయరు. కానీ చైల్డ్ ట్రాఫికింగ్ చేసే వారు పదే పదే ఆ నేరాలకు పాల్పడుతున్నారు. వారు ప్రమాదకరం” అని కోర్టు పేర్కొంది.

పోలీసులకు ఆదేశాలు

ఢిల్లీలో పిల్లల అక్రమ రవాణా రాకెట్‌ వెనకున్న కీలక సూత్రధారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారని.. దీని వెనక ఒక పెద్ద ముఠా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని కోర్టు పేర్కొంది. అయితే.. వీరిలో కొందరు చిన్నారులు కిడ్నాప్ కాలేదని.. వారి తల్లిదండ్రులే అమ్మేస్తున్నారని కోర్టుకు పోలీసులు తెలిపారు. పిల్లలు దొరికిన తర్వాత వారిని తిరిగి తీసుకునేందుకు పేరెంట్స్ రెడీగా లేకపోతే.. అప్పుడు ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలని కోర్టు వెల్లడించింది. ఏటా రెండు వేల మంది పిల్లల అక్రమ రవాణా కేసులు బయటపడుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

Next Story