లోక్‌సభలో రెండు కీలక ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

by Malleboina Mahesh |

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా, లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కీలక పార్లమెంటరీ బిజినెస్ (షెడ్యూల్) జాబితా విడుదలైంది.

లోక్‌సభలో రెండు కీలక ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా, లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కీలక పార్లమెంటరీ బిజినెస్ (షెడ్యూల్) జాబితా విడుదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) రెండు ముఖ్యమైన ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. మొదట ది సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025. ఈ బిల్లు సెంట్రల్ ఎక్సైజ్ చట్టం, 1944ను సవరించడం ద్వారా, పొగాకు వంటి నిర్దిష్ట వస్తువులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రేట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ఈ చర్య ద్వారా జీఎస్టీ పరిహార సెస్ ముగిసిన తర్వాత కూడా ఈ ఉత్పత్తులపై పన్ను భారం తగ్గకుండా చూసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

రెండోది.. అత్యంత ముఖ్యమైన బిల్లు ది హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు, 2025ను కూడా మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు జాతీయ భద్రత, ప్రజా ఆరోగ్యం వంటి అవసరాల కోసం ఖర్చు చేసే నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పాన్ మసాలా వంటి నిర్దిష్ట వస్తువులను ఉత్పత్తి చేసే యంత్రాల సామర్థ్యం ఆధారంగా, వాటి తయారీ ప్రక్రియలపై ఈ సెస్ విధించబడుతుంది. ఈ సామర్థ్య ఆధారిత సెస్ ద్వారా పన్ను ఎగవేతలను నివారించాలని, ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజు ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 19 వరకు 15 సెషన్స్ లో కొనసాగనుంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్షలు ఎస్ఐఆర్ పై చర్చకు పట్టుబట్టేందుకు సిద్దం అవుతున్నాయి.

Next Story