మణిపూర్ ఘటనపై సూపర్ స్టార్ భార్య షాకింగ్ కామెంట్స్

by Javid Pasha |

మణిపూర్ లో ఓ మహిళను నగ్నంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

మణిపూర్ ఘటనపై సూపర్ స్టార్ భార్య షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ లో ఓ మహిళను నగ్నంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ స్పందించారు. ఈ ఘటన తననెంతో బాధించిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పూర్తిగా చూడాలంటే భయమేసిందని అన్నారు.

దేశంలో మహిళల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో నిత్యం ఏదో మూలనా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story