- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fighter jet: ఏఐ ఆధారిత యుద్ధ విమానం.. తయారీకి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, శత్రు దేశాల నుంచి భవిష్యత్‌లో ఎదుర్కోబోయే పరిణామాలను గమనించిన భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, శత్రు దేశాల నుంచి భవిష్యత్‌లో ఎదుర్కోబోయే పరిణామాలను గమనించిన భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)ను అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్న ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీనిని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), దేశీయ ప్రయివేట్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. శత్రు రాడార్లను తప్పించుకోగగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏసీఎంఏలో ఉంటుంది. దీంతో భారత్ రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఈ తరహా ఫైటర్ జెట్‌లను కలిగి ఉన్న మూడో దేశంగా అవతరిస్తుంది. ప్రస్తుతం అమెరికా, చైనాలు మాత్రమే ఐదో తరం యుద్ధ విమానాలను నిర్వహిస్తున్నాయి.
గేమ్ చేంజర్‌గా ఏఎంసీఏ
ఏఎంసీఏ అనేది 25 టన్నుల బరువున్న ట్విన్-ఇంజన్ విమానం, దీని అంతర్గత ఇంధన ట్యాంక్ 6.5 టన్నుల సామర్థ్యం కలిగి ఉండి 55000 అడుగుల ఎత్తులో ఎగురగలదు. అంతేగాక ఈ ఫైటర్ జెట్ లో ఆర్టిఫిషియ్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత పైలట్ సైతం కలిగి ఉంటుంది. అలాగే రియల్-టైమ్ కంబాట్ కోఆర్డినేషన్ కోసం నెట్‌సెంట్రిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, వివిధ రకాల ఆయుధాల కోసం అంతర్గత ఆయుధ బే, ప్రిడిక్టివ్ నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్‌మెంట్‌ను కూడా కలిగి ఉండనుంది. అంతర్గత ఆయుధ బే నాలుగు దీర్ఘ-శ్రేణి ఎయిర్-టూ-ఎయిర్ క్షిపణులను, అనేక ప్రెసిషన్-గైడెడ్ మందుగుండు సామగ్రిని మోయగలదని,1,500 కిలోల పేలోడ్ ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇది ఆధునిక యుద్ధంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యంతో పాటు, ప్రతి కూల వాతావరణ పరిస్థితుల్లోనూ సత్తాచాటుతుంది.
2035 నాటికి అందుబాటులోకి !
ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 15,000 కోట్లుగా అంచనా వేశారు. 2035 నాటికి ఇది అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) వ్యూహాత్మక పరిశ్రమ భాగస్వామ్యాలతో ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. భారత వైమానిక దళం తన దీర్ఘకాలిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ విజయంతో ప్రస్తుతం ఏఎంసీఏ వంటి అధునాతన యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో భారత్ కీలకంగా వ్యవహరించనుందని డిఫెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
రక్షణ సామర్థ్యాలను పెంచడమే లక్ష్యం: రాజ్ నాథ్ సింగ్
భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యమని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన దిశగా ఒక ప్రధాన మైలురాయిగా ఉండే ఏఎంసీఏ నమూనాను అభివృద్ధి చేయడానికి స్వదేశీ నైపుణ్యం, సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ఇది ఒక కీలక పరిణామమని అభివర్ణించారు. ఐదో తరం యుద్ధ విమానం భారత నౌకాదళంలో చేరితే న్యం బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






