- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్ర్య దినోత్సవం.. అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఫైట్‌కు దిగారు. అది కూడా ఒకేపార్టీకి చెందినవారు కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేష్ చౌధరి, సౌరభ్ శ్రీవాస్తవ్ మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకోగా.. వీడియో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఫైట్‌కు దిగారు. అది కూడా ఒకేపార్టీకి చెందినవారు కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేష్ చౌధరి, సౌరభ్ శ్రీవాస్తవ్ మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకోగా.. వీడియో వైరల్ అవుతోంది. ‘విజన్ 2047’ పత్రంపై చర్చ జరుగుతుండగా.. తన పేరును స్పీకర్‌కు పంపించకపోవడంపై సౌరభ్‌పై ఫైర్ అయ్యాడు రాజేష్ చౌధరి. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం కాస్త ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో తోటి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు.
ఇక ఈ వీడియోను షేర్ చేసిన సమాజ్ వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్.. బీజేపీ నేతల సంస్కారం ఇది.. అంటూ విమర్శలు గుప్పించాడు. బ్యాడ్ బిహేవియర్.. అబ్యూజివ్ లాంగ్వేజ్.. వారి సక్సెస్‌కు మెట్లు అంటూ.. అసెంబ్లీలో నాయకుల తీరును ఖండించాడు. అయితే దీనిపై స్పందించిన రాజేష్ చౌధరి.. ముందు నీ భార్య డింపుల్ యాదవ్‌పై ఓ మత గురువు చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయితే బాగుంటుందని.. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవడం వదిలేసి.. ఇతరులపై పడటం ఏంటో అని రివర్స్ ఎటాక్ చేశాడు. కాగా ఆగస్టు 14న ఈ ఫైట్ జరగ్గా.. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ఇలా ఎమ్మెల్యేలు ఫైట్ చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






