Breaking: 50 మంది మావోయిస్టులు లొంగుబాటు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-30 18:55:32  IST  )

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బీజాపూర్‌లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు..

Breaking: 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం(Chhattisgarh State) సుక్మా జిల్లా బీజాపూర్‌(Bijapur)లో 50 మంది మావోయిస్టులు(Maoists) లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్(SP Jitender Kumar), సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ(CRPF DIG Devendra Negi) ఎదుట వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం సైతం లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈయనపై రూ. 8 లక్ష రివార్డు ఉంది. మరో ఇద్దరు కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణిపైనా రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై దాదాపు రూ. 60 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. వీరితో సహా మొత్తం 50 మంది మావోయిస్టులు తాజాగా లొంగిపోయారు. వీరంతా గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌ పరిధిలో పని చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినటైందని చెబుతున్నారు.

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో భాగంగా ఆపరేషన్ ‘కగర్’ ను తెరపైకి తీసుకొచ్చారు. మావోయిస్టు ఏరివేతను కొనసాగించారు. గత ఏడాదిలో ప్రారంభమైన ‘కగర్’ ఆపరేషన్‌.. ఒరిస్సా ఎన్‌కౌంటర్‌తోనే భారీ విజయాన్ని సాధించింది. అటు ఛత్తీస్‌గడ్‌లోనూ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడం, నీటి సమస్య ఉండటంతో మావోయిస్టులను ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో వరుసగా 30,20,15 మంది మావోయిస్టులు పిట్లల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోవడం చర్చగా మారింది.

Next Story