ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం.. పేలుళ్ల దాటికి కంపించిన భూమి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-16 05:16:16  IST  )

ఇజ్రాయెల్ (Isreal), ఇరాన్ (Iran) ​మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ జరుపుతున్న భీకర దాడులు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం.. పేలుళ్ల దాటికి కంపించిన భూమి
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ (Isreal), ఇరాన్ (Iran) ​మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ జరుపుతున్న భీకర దాడులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. 'ఆపరేషన్​ రైజింగ్​ లయన్' పేరుతో ఇరాన్ ​రాజధాని టెహ్రాన్​పై ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులు చేయగా.. ఇరాన్​ కూడా తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. అయితే, సోమవారం ఉదయం ఇరాన్‌లోని ఫోర్డో (Fordow) అణు శుద్ధి కేంద్రం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించగా, స్వల్ప స్థాయిలో భూప్రకంపాలు (Earthquake) నమోదయ్యాయి. అణు కేంద్రానికి సమీపంగా మౌంటైన్లు ఉన్న కారణంగా రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇరాన్ భూకంపశాస్త్ర సంస్థ తెలిపింది. భూప్రకంపనల కేంద్ర బిందువు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఫోర్డో అణు కేంద్రం ఇరాన్‌లో అత్యంత రహస్యమైన అణు శుద్ధి కేంద్రాల్లో ఒకటి.

Next Story
null