నారాయణ్‌పూర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. 25 మంది మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 05:47:09  IST  )

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ‌పూర్ జిల్లాతో పాటు అబూజ్‌మడ్‌ అడవులు, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన డీఆర్జీ జవాన్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు

నారాయణ్‌పూర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. 25 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar)తో ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు ఇవాళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ‌పూర్ (Narayanapur) జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సుమారు 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. అబూజ్‌మడ్‌ అడవులు, నారాయణ పూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల పరిధిలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన సుమారు 2 వేల మంది డీఆర్జీ జవాన్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ (Combing Operation) చేపట్టారు.

అయితే, నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో వారికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ క్రమంలోనే డీఆర్జీ జవాన్లు మావోయిస్ట్ అగ్రనేతలను చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. జరిగిన ఎన్‌కౌంటర్ సుమారు 25 మంది మావోయిస్టులు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే, డీఆర్జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య తగ్గేదే లేదు అన్నట్లుగా హోరాహోరీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Next Story