- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జార్ఖండ్‌లో భీకర ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ కమాండర్ మృతి
వరుస ఎన్‌కౌంటర్లు, భద్రతా దళాల ముప్పేట దాడితో సతమతమవుతోన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఎన్‌కౌంటర్లు, భద్రతా దళాల ముప్పేట దాడితో సతమతమవుతోన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ (Jharkhand)లోని లాటేహార్ (Latehar) జిల్లాలోని మహుడనే పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంఖర్, ధోవ్నా గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం పోలీసు ఉన్నతాధికారులు అందింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నుంచి సీఆర్‌పీఎప్ (CRPF) అనుబంధ యూనిట్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ బృందం (Jharkhand Jaguars Team), జిల్లా పోలీసులు కలిసి జాయింట్ కూబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ టాప్ కమాండర్, బిహార్ రాష్ట్రం గయా జిల్లాకు చెందిన మనీశ్ యాదవ్ (Manish Yadav) తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు మావోయిస్టులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇక ఏరియా కమాండర్ కుందన్ ఖేర్వార్ (Kundan Kherwar) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చనిపోయిన టాప్ కమాండర్ మనీశ్ యాదవ్‌పై రూ.10 లక్షల రివార్డు కూడా ఉన్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఘటనా స్థలంలో రెండు ఎక్స్-95 ఇజ్రాయిల్ అసాల్ట్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
హార్డ్ లైనర్‌గా మనీశ్ యాదవ్..
మావోయిస్ట్ పార్టీ శ్రేణుల్లో హార్డ్ లైనర్ (Hard Liner)గా మనీష్ యాదవ్ పేరుగాంచారు. గత రెండు దశాబ్దాలుగా ఉద్యమంగా చురుకుగా ఉన్న అతడు బీహార్ (Bihar), జార్ఖండ్ సరిహద్దు ఆపర్లేషన్లలో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు సీనియర్ మావోయిస్ట్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్ కుమార్ సింగ్ (Dev Kumar Singh) అలియాస్ అరవింద్ పర్సనల్ బాడీగార్డ్‌గా కూడా పని చేశాడు. సమారు మనీశ్ యాదవ్ 50 కంటే ఎక్కువ సాయుధ ఆపరేషన్లలో పాల్గొన్నట్లుగా అక్కడి పోలీసు వర్గాలు తెలిపాయి.






