Love Affair: స్టూడెంట్ తో మహిళా టీచర్ ఎఫైర్.. టాబ్లెట్స్ ఇచ్చి మరీ..

by Prasad Jukanti |   (  Updated:2025-07-02 08:58:15  IST  )

స్టూడెంట్ తో మహిళా టీచర్ ఎఫైర్ కలకలం రేపింది.

Love Affair: స్టూడెంట్ తో మహిళా టీచర్ ఎఫైర్.. టాబ్లెట్స్ ఇచ్చి మరీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ టీచర్ దారి తప్పింది. పుస్తకాల్లోని పాఠాలు చెప్పాల్సిన ఆమె ఓ విద్యార్థికి ప్రేమ పాఠాలు మొదలు పెట్టింది. వద్దని వారించినా టీచర్లు- విద్యార్థుల మధ్య ఇలాంటివి సహజమే అంటూ లైంగిక వేధింపులకు గురి చేసింది. చివరకు ఆ బాలుడి ఇంట్లో విషయం తెలియడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. ముంబయి లో వెలుగు చూసిన ఈ ఘటన గురుశిష్యుల బంధానికి మచ్చగా మారింది. ముంబయిలోని ఓ ప్రముఖ స్కూల్ లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ (40) ఇంగ్లీష్ లాంగ్వేజ్ ను బోధిస్తున్నది. 2023 లో పాఠశాల వార్షికోత్సవం కోసం గ్రూప్ డ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్న సమయంలో బాధిత విద్యార్థి (16)తో టీచర్ పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత ఆ బాలుడిపై మోజు పెంచుకున్న సదరు టీచర్ క్రమంలో ఆ బాలుడితో మరింత క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది.

టాబ్లెట్ ఇచ్చి వేధింపులు:

ఈ క్రమంలో 2024 జనవరిలో తొలిసారి లైంగికంగా వేధించిన ఆ టీచర్ ఆ తర్వాత క్రమంగా వేధింపులు రెట్టింపు చేసింది. అయితే ఇందుకు ఆ బాలుడి అయిష్టత చూపడంతో బాలుడిని ఒప్పించేందుకు టీచర్ తన మహిళా స్నేహితురాలిని రంగంలోకి దింపిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆమె విద్యార్థితో మాట్లాడుతూ వృద్ధ మహిళలు టీనేజ్ అబ్బాయిల మధ్య సంబంధాలు చాలా కామన్ అని బాలుడిని ఒప్పించే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బాలుడిని ఆ టీచర్ తన కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లడం, ఫైన్ స్టార్ హోటల్ కు తీసుకువెళ్లి అక్కడ మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడటం చేసింది. ఈ చర్యలతో ఆందోళనకు గురైన బాలుడికి యాంటీ-యాంగ్జైటీ మాత్రలు సైతం ఆ బాలుడికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బోర్డు ఎగ్జామ్స్ త్వరలోనే పూర్తవుతాయని ఆ తర్వాత స్కూల్ మార్పించవచ్చని భావించి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థి పాఠశాలను విడిచిపెట్టాడు. కానీ సదరు ఉపాధ్యాయురాలు మాత్రం మళ్లీ బాలుడిని సంప్రదించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ మహిళా టీచర్ పై పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఆ టీచర్ కు ఇది వరకే వివాహం అయి పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read More..

అమ్మమ్మను పెళ్లి చేసుకున్న మనవడు.. తాత పోయాక జరిగిందదే మరి..

Next Story