- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fellowship: 10,000 మందికి పీఎం రీసెర్చ్ ఫెలోషిప్.. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ప్రయివేట్ రంగ నేతృత్వంలోని కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం. సాంకేతిక పురోగతిని మెరుగుపరచడంపై దృష్టి పెడతాయి. అలాగే ఐఐటీలు, ఐఐఎస్‌సీలలో సాంకేతిక పరిశోధనల కోసం వచ్చే ఐదేళ్లలో పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకం కింద 10,000 ఫెలోషిప్‌లను అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఫెలోషిప్‌లు ఐఐటీలు, ఐఐఎస్‌సి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతికతలో పరిశోధనలను అభివృద్ధి చేయడానికి దోహదపడతాయి. దీంతో ఐఐటీల్లో 6500 సీట్లు పెరగనున్నాయి. అంతేగాక స్టార్టప్ లను, వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నిధులు అందుబాటులో ఉండేలా చూస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
స్వామిహ్ ఫండ్-2 ప్రకటన
నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్ట్‌లో లక్ష యూనిట్లను పూర్తి చేయడానికి రూ. 15,000 కోట్లతో కొత్త స్వామిహ్ నిధిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడులు నిలిచిపోయిన గృహ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించడమే దీని లక్ష్యమని తెలిపింది. ఈ ఫండ్‌ని స్టేట్ బ్యాంక్ గ్రూప్ కంపెనీ అయిన SBICAP వెంచర్స్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. మొదటి ఫండ్ విజయవంతం అయిన తర్వాత స్వామిహ్ ఫండ్-2ను ప్రకటించారు.






