- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో LPG గ్యాస్ సంక్షోభ భయం.. ‘ఇండేన్’ బుకింగ్ సిస్టమ్ క్రాష్
దేశంలో గ్యాస్ సంక్షోభం భయాల మధ్య ఇండేన్ ఎల్‌పీజీ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలింది. కాల్స్ సంఖ్య 10 రెట్లు పెరగడంతో సర్వర్లు మొరాయించాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ, ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ఇండేన్ (Indane) బుకింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందన్న భయంతో వినియోగదారులు భారీగా రీఫిల్ బుకింగ్స్ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
8-10 రెట్లు పెరిగిన బుకింగ్ కాల్స్..
సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ కాల్స్ సంఖ్య ఒక్కసారిగా 8 నుంచి10 రెట్లు పెరగడంతో ఇండేన్ ఐవీఆర్ఎస్ (IVRS), ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఓవర్‌లోడ్ అయ్యి మొరాయించాయి. ఇవాళ ఉదయం నుంచే వినియోగదారులు ఫోన్ ద్వారా లేదా యాప్ ద్వారా బుక్ చేయడానికి ప్రయత్నించగా, సిస్టమ్ స్పందించకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంతో వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ పానిక్ బుకింగ్ వల్ల వెబ్‌సైట్, సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పడింది.
కొత్త నిబంధనల ప్రభావం..
కేంద్ర ప్రభుత్వం బుకింగ్ గ్యాప్‌ను 25 రోజులకు పెంచడంతో తమకు సిలిండర్ అందుతుందో లేదో అన్న కంగారులో జనం బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. సిస్టమ్ క్రాష్ అయినప్పటికీ.. వాట్సాప్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్ (Indian Oil ONE app) ద్వారా ప్రయత్నించాలని, రాత్రి 10 గంటల తర్వాత బుకింగ్స్ సులభంగా అయ్యే అవకాశం ఉందని సంస్థ సూచించింది.






