- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actor Vijay : నటుడు విజయ్‌కి ఫత్వా జారీ
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత(TVK Cheif) విజయ్(Actor Vijay)కి భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత(TVK Cheif) విజయ్(Actor Vijay)కి భారీ షాక్ తగిలింది. విజయ్‌కి వ్యతిరేకంగా ఫత్వా(Fatwa) జారీ అయింది. నటుడు విజయ్ సినిమాలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆలిండియా ముస్లిం జమాత్(AIMJ) కీలక ప్రకటన చేసింది. సినిమాల్లో ముస్లింలను తీవ్రవాదులుగా చూపిస్తున్నారని మండిపడుతూ.. ముస్లింల కార్యక్రమాలకు విజయ్‌ని పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆయన కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తమిళనాడులోని అఖిల భారత ముస్లిం జమాత్ సభ్యుడైన మౌలానా షహాబుద్దీన్ రజ్వీ విజయ్‌కి వ్యతిరేకంగా ఫత్వా విడుదల చేశారు.
విజయ్ నటించిన కొన్ని సినిమాలు, ముఖ్యంగా వేలాయుధం, తుపాక్కి, బీస్ట్ సినిమాల్లో ముస్లిం పాత్రలను తీవ్రవాదులుగా, ముస్లిం సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించినట్లు ఆరోపించారు. కాగా ఈ ఫత్వా గురించి విజయ్ నుంచి గాని, ఆయన పార్టీ నుండి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.






