PFI ర్యాలీలో అభ్యంతర కర నినాదాలు చేసిన బాలుడు.. తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..

by Disha Web |
PFI ర్యాలీలో అభ్యంతర కర నినాదాలు చేసిన బాలుడు.. తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేరళలో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) భారీ ర్యాలీ నిర్వహించింది. అందులో ఒక బాలుడు చేసిన నినాదాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పీఎఫ్ఐ ర్యాలీ జరుగుతున్న సమయంలో బాలుడు ముస్లింలు కాని మతస్తుల వారికి తీవ్ర వ్యతిరేకంగా, రెచ్చగొట్టే విధంగా, ఇతర మతస్థుల పట్ల తీవ్ర ద్వేష భావంతో నినాదాలు చేశాడు. వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టు సైతం స్పందించి సంబంధింత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది. అయితే అంతటి ద్వేషపూరిత నినాదాలు చేసింది ఓ 10 ఏళ్ల మైనర్ బాలుడు.

దీంతో హైకోర్టు అంత చిన్న వయసులోనే ఇతర మతాల పట్ల, మతస్తుల పట్ల అంతటి ద్వేషం పెరగడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేరళ పోలీసులు శనివారం ఆ బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తండ్రిని అతడి ఇంటిలో అదుపులోకి తీసుకున్నామని, అతడిని అలప్పుజా పోలీసులకు అప్పజెప్పామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే తమ కుమారుడికి ఎవరూ ప్రత్యేకంగా నేర్పించలేదని, తానుకూడా అటువంటివి చెప్పలేదని, అదంతా బాలుడు తనంతట తానుగా చేశాడని తెలిపాడు.

Next Story