కోడలిపై మోజు.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని జగదీష్‌పురలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ఆత్మహత్య.. హత్య అని తేలింది. 26 ఏళ్ల పుష్పేంద్ర చౌహాన్ హోలి రోజున అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు నమ్మించారు

కోడలిపై మోజు.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని జగదీష్‌పురలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ఆత్మహత్య.. హత్య అని తేలింది. 26 ఏళ్ల పుష్పేంద్ర చౌహాన్ హోలి రోజున అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు నమ్మించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. హంతకుడు తండ్రే అని తేల్చారు. చరణ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో మర్డర్ జరిగినట్లు తేలగా.. తమదైన రీతిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. అసలు నిజాన్ని బయటపెట్టారు.

చరణ్ సింగ్ తన కొడుకు భార్యపై మోహం పెంచుకున్నాడు. ఆ మోజులో కొడుకును హత్య చేసి.. శరీరం పక్కన పిస్టల్ ఉంచాడు. తండ్రి ప్రవర్తన కారణంగా.. పుష్పేంద్ర ఇంటిని వదిలి మథురాలో నివసించడానికి వెళ్లాడు. పండుగ సమయంలో ఇంటికి తిరిగి రాగా.. కన్న తండ్రి అతని ప్రాణం తీశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

Next Story