భార్యను ఇంటికి రప్పించేందుకు 8 ఏళ్ల కూతురిపై దారుణం

by Naga Rani Yarlagadda |

తన నుంచి విడిపోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు ఓ వ్యక్తి కూతురిపై చేసిన పని.. అతడిని జైలుపాలయ్యేలా చేసింది. ఈ ఘటన కేరళ (Kerala)లోని కన్నూర్‌ (Kannur)లో చెరుపుళలో వెలుగుచూసింది.

భార్యను ఇంటికి రప్పించేందుకు 8 ఏళ్ల కూతురిపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: తన నుంచి విడిపోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు ఓ వ్యక్తి కూతురిపై చేసిన పని.. అతడిని జైలుపాలయ్యేలా చేసింది. ఈ ఘటన కేరళ (Kerala)లోని కన్నూర్‌ (Kannur)లో చెరుపుళలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు జోస్ (39) నుంచి తన భార్య కొంతకాలంగా దూరంగా ఉంటోంది. పిల్లలిద్దరూ అతని వద్దే ఉన్నారు. భార్యను ఎలాగైనా ఇంటికి రప్పించాలని తన కూతురిని అసభ్యపదజాలంతో తిడుతూ, కత్తితో బెదిరిస్తోన్న వీడియో రికార్డ్ చేసి ఆమెకు పంపాడు. ఈ క్రమంలో ఆ వీడియో క్లిప్ శుక్రవారం (మే23) సోషల్ మీడియాలో వైరలైంది.

వీడియో చూసిన నెటిజన్లు.. చిన్నారిని హింసిస్తున్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సబ్ ఇన్‌స్పెక్టర్ రూప ఆధ్వర్యంలో పోలీసుల బృందం జోస్ నివాసాన్ని సందర్శించింది. బాలికను ప్రశ్నించగా.. తన తల్లికోసమే ఆ చిలిపి పని చేసినట్లు చెప్పడంతో పోలీసులు వదిలేశారు. కానీ.. జోస్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ పెరగడంతో శనివారం అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

ఆ వీడియోను బాలిక సోదరుడు రికార్డ్ చేశాడని, కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్న తల్లిని రప్పించేందుకే ఇలా చేశామని ఇద్దరు పిల్లలు వాంగ్మూలం ఇచ్చారని సబ్ ఇన్‌స్పెక్టర్ రూప తెలిపారు. కానీ వీడియోలో జోస్ ఉపయోగించిన భాష, బాలికను కొట్టిన, కత్తితో బెదిరించిన విధానం అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జోస్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)కి పంపామన్నారు. పిల్లల్ని మహిళా, శిశు అభివృద్ధి శాఖ సంరక్షణలో ఉన్న షెల్టర్ హోమ్ కు తరలించినట్లు చెప్పారు.

Next Story