- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫతేపూర్ లో ఘోర రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ
ఆగిఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు(Goods Train) వచ్చి ఢీకొట్టిన ప్రమాదకర (Accident) ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarapradesh)లోని ఫతేపూర్ (Fatehpur) సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆగిఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు(Goods Train) వచ్చి ఢీకొట్టిన ప్రమాదకర (Accident) ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarapradesh)లోని ఫతేపూర్ (Fatehpur) సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గూడ్స్ రైళ్లలోని ఇద్దరు లోకోపైలట్లు (Loco Pilots) గాయపడ్డారు. మంగళవారం కాన్పూర్ (Kanpur)- ఫతేపూర్ మధ్య ఖాగా (Kaga) ప్రాంతంలో పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును, వేగంగా వస్తున్న మరో గూడ్స్ రైలు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆగి ఉన్న గూడ్స్ రైలు కంపార్ట్మెంట్లు (Compartments) పట్టాలు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్లలోని లోకో పైలట్లు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన లోకో పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రైల్వే అధికారి (Railway Officer) మాట్లాడుతూ.. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని, సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం కలుగుతుందని చెప్పారు. అలాగే ప్రమాదంలో జరిగిన నష్టాన్ని (Loss) అంచనా వేసేందుకు అధికారులను నియమించామని, వారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, నివేదిక సమర్పిస్తారని తెలియజేశారు. ఇక ప్రమాదానికి గురైన రైళ్లను తొలగించి, సాధరణ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక దీనిపై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (Community Health Center) వైద్యుడు సుభాష్ దూబే (Doctor Subhash Dube) మాట్లాడుతూ.. గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తీసుకొచ్చారని, వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో ప్రథమ చికిత్స చేసి, డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. గాయపడిన లోకో పైలట్లు అనుజ్ రాజ్ (Anuz Raj), శివశంకర్ యాదవ్ (Shiva Shankar Yadav)లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.






