- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం.. ఐదుగురి మృతి
by Muthe.Rajitha |
టాంజానియాలోని మౌంట్ కిలిమంజారోపై ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : టాంజానియాలోని మౌంట్ కిలిమంజారోపై ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం కిలిమంజారో పర్వతంపై వైద్య చికిత్స కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. బరాఫు క్యాంపు–కిబో సమ్మిట్ మధ్య సుమారు 4,000 మీటర్ల ఎత్తులో వైద్య సహాయం కోసం వెళ్లిన సమయంలో హెలికాఫ్టర్ క్రాష్ కావడంతో పైలట్, డాక్టర్, టూరిస్ట్ గైడ్‌తో పాటు మరో ఇద్దరు విదేశీ పర్యాటకులు కలిపి మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదని.
టాంజానియా పోలీసులు, టాంజానియా సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో (5,895 మీటర్లు) పర్యాటకులకు ప్రసిద్ధి అయినప్పటికీ, ఎత్తు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు.
Next Story






