కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య అర్థంతరంగా ముగిసిన చర్చలు

by Ajay Maddhiboyina |

ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయి. అందుకే మార్చి 19న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య అర్థంతరంగా ముగిసిన చర్చలు
X

- కనీస మద్దతు ధరపై కుదరని ఏకాభిప్రాయం

- మార్చి 19న తదుపరి రౌండ్ చర్చలు

దిశ, నేషనల్ బ్యూరో: రైతు నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చండీగఢ్‌లో నిర్వహించన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. కనీసం మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రధాన అంశంగా శనివారం జరిగిన చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో మరో సారి చర్చలు కొనసాగించాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మాట్లాడుతూ ప్రభుత్వ, రైతులు కనీస మద్దతు ధరపై చర్చించారు. కానీ ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపారు. చట్టబద్దంగా హామీ ఇవ్వబడిన 23 పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరపై రైతులు చాలా దృఢంగా ఉన్నారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించలేదని అన్నారు. కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. ఇక జగ్జిత్ సింగ్ దల్లెవాల్ సహా 28 మంది నాయకులు రైతుల తరపున ప్రాతినిథ్యం వహించారు.

శనివారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో మార్చి 19న తిరిగి సమావేశమవడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. కేంద్రం ఇప్పటికే ఎంఎస్‌పీ అమలు చేస్తున్న పంటలతో పాటు రెండు లేదా మూడు పంటలకు దాన్ని పొడిగిస్తామని చెప్పింది. అయితే రైతులు మాత్రం మొత్తం 23 పంటలకు ఎంఎస్‌పీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చల అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు సానుకూల వాతావరణంలోనే జరిగాయనిచెప్పారు. మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలను మేము రైతుల ముందు ఉంచాము. అలాగే వారి డిమాండ్లు కూడా విన్నాము. అయితే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయి. అందుకే మార్చి 19న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని చెప్పారు.

Next Story