- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. ఫరీదాబాద్ మాడ్యూల్ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే
ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అని పోలీసులు తేల్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అని పోలీసులు తేల్చారు. అతడిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా.. షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. జమ్మూకశ్మీర్లోని షోపియాన్ కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మెడికల్ స్టూడెంట్స్ కు ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అతను శ్రీనగర్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇమామ్ గా మారాడు. నౌగామ్ లోని మసీదు వేదికగా వైద్య విద్యార్థులతో పరిచయం పెంచుకున్న ఇర్ఫాన్.. వారిని ఉగ్రవాదులుగా మార్చాడు.
జూనియర్ డాక్టర్ షాహిన్ విచారణలోనూ పలు కీలక విషయాలు తెలిశాయి. రెండేళ్ల నుంచి దేశవ్యాప్తంగా పేలుళ్లు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది. ఉగ్రడాక్టర్లైన షాహిన్, ఉమర్, ముజమ్మిల్ కలిసి అమ్మోనియా నైట్రేట్ సేకరించారు. జైషే ఉగ్రసంస్థ కోసమే దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు షాహిన్ వెల్లడించింది.
మరోవైపు FSL టీమ్ ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో రిపోర్టును రెడీ చేస్తోంది. డాక్టర్ ఉమర్ డిటోనేటర్లతో అమోనియం నైట్రేట్ బాంబును పేల్చారు. ఇందులో మొత్తం 42 ఆధారాలను పరిశీలించిన FSL టీమ్.. ఫిదాయీన్ స్టైల్లో ఎటాక్ కు పాల్పడినట్లు గుర్తించింది. ఈ బ్లాస్ట్ లో చనిపోయిన వారి వివరాలను సేకరిస్తున్న అధికారులు..వారిలో ఎవరైనా ఉగ్రవాదులు లేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నవారు ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






