తప్పుడు పోక్సో కేసు.. ఏడాదిపాటు జైల్లో బాలుడు

by Muthe.Rajitha |

తన స్నేహితురాలు తప్పుడు ప్రవర్తన కలిగిన ప్రియుని బారిన పడిందని, ఎలాగైనా ఆమెను కాపాడాలి అనుకున్నాడు ఓ బాలుడు.

తప్పుడు పోక్సో కేసు.. ఏడాదిపాటు జైల్లో బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తన స్నేహితురాలు తప్పుడు ప్రవర్తన కలిగిన ప్రియుని బారిన పడిందని, ఎలాగైనా ఆమెను కాపాడాలి అనుకున్నాడు ఓ బాలుడు. ఆ ప్రయత్నంలో ఆ బాలిక తన స్నేహితుని మీదనే తప్పుడు పోక్సో కేసు పెట్టడంతో ఏడాదిపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అనేక విచారణల అనంతరం అతని తప్పు లేదని కోర్టు తేల్చడంతో ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యాడు. హరియాణాలోని పానిపట్ లో ఈ ఘటన జరిగింది. తన ఫ్రెండ్ ను కాపాడాలనుకున్న పాపానికి తనే బలై, జైల్లో మగ్గాల్సి వచ్చింది.

ఆ కేసులో నుంచి బయట పడటానికి ఏడాదిపాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. అనంతరం జైలు నుంచి విడుదలైనప్పటికీ.. తన మీద పడిన మచ్చ సంగతి ఏంటని, తన ఏడాది జీవితం సంగతి ఏమిటని ఆ బాలుడు ప్రశ్నిస్తున్నాడు . తప్పుడు కేసు పెట్టిన బాలికను కూడా జైల్లో పెట్టాలని నెటిజన్స్ మండిపడుతున్నారు.

Next Story