Falcon-9: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఫాల్కన్-9 రాకెట్.. భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-17 11:51:08  IST  )

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఫాల్కన్-9 దూసుకెళ్లింది.

Falcon-9: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఫాల్కన్-9 రాకెట్.. భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఫాల్కన్-9 (Falcon-9) దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ (Sunita Williams, Butch Wilmore) త్వరలోనే భూమి మీదకు రానున్నారు. అయితే, వారిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 (Falcon-9) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాసా-స్పేస్ఎక్స్ (NASA-SpaceX) చేపట్టిన ‘క్రూ-10’ (‘Crew-10’) మిషన్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 4.33కు కెన్నడీ స్పేస్ సెంటర్ (Kennedy Space Center) నుంచి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

కాగా, ఈ మిషన్‌ను 12న చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టమ్‌ (Rocket Ground System)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. అన్ని లోటుపాట్లను సరి చేసి ఇవాళ తెల్లవారుజామున రాకెట్‌ను లాంఛ్ చేశారు. డ్రాగన్ క్యాప్సూల్‌లో ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌ (International Space Center)కు వెళ్లిన వ్యోమగాముల్లో నికోల్ అయర్స్, కిరిల్ పెస్కోవ్, అన్నె మెక్లెయిన్, టకుయా ఒనిషి ఉన్నారు. స్పేస్ షిక్ ఐఎస్ఎస్‌తో నేడు అనుసంధానం కానుంది. ఆ నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ బాధ్యతలు తీసుకున్న వెంటనే సునీత, బచ్ విల్‌మోర్ ఈ నెల 19న భూమి మీద అడుగు పెట్టనున్నారు.

కాగా, 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ (Sunita Williams, Butch Wilmore) ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌కు చేరుకున్నారు. వారం వ్యవధిలో వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా వారిని తీసుకెళ్లిన స్పెష్ షిప్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో అది వారు లేకుండానే భూమిని చేరింది. ఈ నేపథ్యంలో 9 నెలల అనంతరం నలుగురు వ్యోమగాములతో కూడిన స్టార్ లైనర్ ఐఎస్ఎస్‌కు చేరనుంది.

Next Story