- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PIB Fact Check : భారత సైనిక పత్రాలు లీక్ అంటూ పాక్ ఫేక్ పోస్టులు
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్- పాక్(Bharat-Pak) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్- పాక్(Bharat-Pak) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించి కొందరు పాకిస్తానీయులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్టు భారత్ గుర్తించింది. భారత సైన్యానికి సంబంధించిన రహస్య పత్రాలు, సైన్యానికి చెందిన ఓ రిపోర్ట్ లీక్ అయినట్లు పాక్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం జరుగుతుండగా.. భారత ప్రభుత్వం, PIB ఫ్యాక్ట్‌చెక్ అవన్నీ నకిలీ వార్తలని కొట్టి పారేశాయి. ఈ ఫేక్ పోస్టుల ఉద్దేశం భారత సైన్యం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, దేశ సమగ్రతను దెబ్బతీయడం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
గతంలోనూ పాకిస్తాన్ ఇలాంటి నకిలీ వీడియోలు, పత్రాలతో భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయమీ గుర్తు చేసింది. మరోవైపు సైన్యం ఆధునీకరణ కోసం విరాళాలు సేకరిస్తున్నారు అంటూ చక్కర్లు కొడుతున్న వార్త కూడా నకిలీదిగా రక్షణశాఖ స్పష్టం చేసింది.






