డిహైడ్రేషన్ ప్లాంట్ ముసుగులో నకిలీ మద్యం దందా: ఆరుగురి అరెస్ట్

by Ramesh Naini |

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో మరో భారీ నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయింది.

డిహైడ్రేషన్ ప్లాంట్ ముసుగులో నకిలీ మద్యం దందా: ఆరుగురి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో మరో భారీ నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయింది. భావ్‌నగర్ జిల్లా మహువా సమీపంలోని గూందర్ణి గ్రామంలో ఓ డిహైడ్రేషన్ ప్లాంట్ ముసుగులో ఈ అక్రమ దందా కొనసాగుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ ఫ్యాక్టరీపై ఆకస్మిక దాడి చేశారు. డ్రమ్ముల్లో ఉన్న నకిలీ మద్యాన్ని ఖరీదైన బ్రాండెడ్ సీసాల్లోకి నింపుతూ పట్టుబడిన ఆరుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యం, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రమ్ముల నుంచి సీసాల్లోకి మద్యాన్ని బదిలీ చేస్తున్న దృశ్యాలున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటీవలే బనస్కాంత జిల్లాలోనూ అచ్చం ఇలాగే నకిలీ మద్యం తయారు చేస్తున్న ఓ మినీ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రంలో కఠినంగా మద్యం నిషేధం అమలులో ఉన్నప్పటికీ, వరుసగా రెండు ఫ్యాక్టరీలు వెలుగు చూడటం గమనార్హం.

Next Story