ఫేక్ కాల్ సెంటర్.. కోట్లలో సంపాదన..ఇలా కూడా మోసం చేయొచ్చా..??

by Sujitha Rachapalli |

సెంట్రల్ నోయిడాలో ఫేక్ కాల్ సెంటర్‌ను గుర్తించారు పోలీసులు. టెక్నికల్ సపోర్ట్ పేరుతో ఫారిన్ సిటిజన్స్‌ను మోసం చేస్తూ కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తేలింది. సైబర్ గ్యాంగ్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్ నుంచి

ఫేక్ కాల్ సెంటర్.. కోట్లలో సంపాదన..ఇలా కూడా మోసం చేయొచ్చా..??
X

దిశ, వెబ్ డెస్క్ : సెంట్రల్ నోయిడాలో ఫేక్ కాల్ సెంటర్‌ను గుర్తించారు పోలీసులు. టెక్నికల్ సపోర్ట్ పేరుతో ఫారిన్ సిటిజన్స్‌ను మోసం చేస్తూ కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తేలింది. సైబర్ గ్యాంగ్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్ నుంచి 23 ల్యాప్ టాప్స్, 25 హెడ్ సెట్స్,17 మొబైల్స్, పెన్ డ్రైవ్స్, ఫేక్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలతో సహా 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

కాగా నిందితులు గూగుల్ యాప్స్ ద్వారా అమెరికా డేటా సెల్లర్స్ నుంచి ఫారిన్ సిటిజన్స్ డేటా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం X-Lite, IBM యాప్స్ ఉపయోగించి.. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్‌గా కాల్ చేస్తారు.. టీమ్ వ్యూయర్, ఆల్ట్రా వ్యూయర్ లాంటి రిమోట్ యాక్సెస్ డౌన్ లోడ్ చేయించి.. వారి సిస్టమ్స్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. సీఎండీ ప్రాంప్ట్ ఓపెన్ చేసి.. హ్యాకింగ్, బ్యాంక్ డిటెయిల్స్ లీక్ అవుతాయనే భయాన్ని పుట్టించి మోసాలకు పాల్పడుతారు. క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రాన్జాక్షన్స్ చేస్తున్నట్లు తేలింది.

Next Story