- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: అలా చేయకుంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే- మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక బాధ్యతలు చేపట్టారు

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో చరుకుగా వ్యవహిస్తున్న మస్క్.. ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (OPM) నుంచి మెయిల్ పంపారు. అందులో ఉద్యోగులందరూ గతవారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో వివరించాలని పేర్కొన్నారు. అలా చేయకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఈ మెయిల్‌కు సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు..5 వాక్యాల్లో ఉద్యోగులు రిప్లయ్ ఇవ్వాలని ఆదేశించారు.
ట్రంప్ పై విమర్శలు
కాగా..ఈ విషయంపై యూఎస్‌కు చెందిన అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ (AFGE) జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ మండిపడ్డారు. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని పేర్కొన్నారు. తన జీవిత కాలంలో ఒక్కసారి మస్క్ నిజాయితీగా ప్రజా సేవ చేయలేదని ఫైర్ అయ్యారు. అలాంటి మస్క్‌తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అగౌరవపరచడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చిన మెయిల్‌కు రిప్లయ్ ఇవ్వొద్దని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరోవైపు, ఇటీవల ట్రంప్ డోజ్ (DOGE) విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.






