- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.21వేల పెట్టుబడితో రోజుకు రూ.1.25 లక్షల ఆదాయం..వైరల్ వీడియోపై కేంద్రం క్లారిటీ
కేవలం రూ.21వేల పెట్టుబడితో రోజుకు రూ.1.25 లక్షల ఆదాయం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా వీడియోలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామణ్, ప్రధాని మోడీని ప్రచారం చేస్తున్నట్టు డీప్ ఫేక్ క్రియేట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కేవలం రూ.21వేల పెట్టుబడితో రోజుకు రూ.1.25 లక్షల ఆదాయం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా వీడియోలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామణ్, ప్రధాని మోడీని ప్రచారం చేస్తున్నట్టు డీప్ ఫేక్ క్రియేట్ చేశారు. వీడియో లింక్ కింద క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ సైబర్ నేరానికి పాల్పడుతున్నారు. వీడియో తెగ వైరల్ అవ్వడంతో ఈ మోసంపై ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. మోడీ, సీతారామన్ పేరుతో ప్రచారం అవుతున్న వీడియోలు నఖిలీవి అని స్పష్టం చేసింది. ఈ వీడియోలు డిజిటల్‌గా మానిప్యులేట్ చేసినవి అని స్పష్టం చేసింది. ఇలాంటి పెట్టుబడి స్కీములు ప్రధాని నరేంద్ర మోడీ కానీ కేంద్రం కానీ ప్రవేశపెట్టలేదని తెలిపింది. ఇలాంటి ఏ వేధికతోనూ మోడీ, నిర్మలా సీతారామణ్‌కు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురికావద్దని సూచించింది. ఇలాంటివి షేర్ చేసే ముందు చెక్ చేసుకోవాలని చెప్పింది.






