- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: రాష్ట్రపతికి ఆదేశాలివ్వాలా?.. విమర్శలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
రాష్ట్రపతికి మాండమస్ రిట్ జారీ చేయాలని ఆదేశాలివ్వాలా?” అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో హింస చెలరేగింది.

దిశ, నేషనల్ బ్యూరో: “రాష్ట్రపతికి మాండమస్ రిట్ జారీ చేయాలని ఆదేశాలివ్వాలా?” అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో హింస చెలరేగింది. దీంతో, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని, పారామిలిటరీ దళాలను మోహరించాలని కోరుతూ.. న్యాయవాది విష్ణు శంకర్ జైన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “కార్యనిర్వహాక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా? ఇందుకోసం రాష్ట్రపతికి మాండమస్ రిట్ జారీ చేయాలని ఆదేశాలివ్వాలని మీరు కోరుకుంటున్నారా? ” అని పిటిషనర్ తో కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ముఖ్యతీర్పులపై బీజేపీ విమర్శలు
గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవడానికి కాలపరిమితిని నిర్ణయించడం, వక్ఫ్ సవణ చట్టంలోని కొన్ని నిబంధనలు నిలిపివేయడం అనే రెండు ముఖ్యమైన తీర్పులను సుప్రీంకోర్టు ఇటీవలే వెలువరించింది. ఈ ముఖ్యమైన తీర్పుల నేపథ్యంలో సుప్రీంకోర్టు బీజేపీ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంది. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశాలు జారీ చేయమని పిటిషన్ కోరారు. దీంతో, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






